Loading...
This site is best viewed in a modern browser with JavaScript enabled.
Something went wrong while trying to load the full version of this site. Try hard-refreshing this page to fix the error.
ZBNF ఘనజీవామృతం తయారు చేసే విధానం
RyotForum
కావలసిన పదార్ధాలు:
100 kg. పశువుల పేడ
4-5 ltr. పశువుల మూత్రం
2 kg పప్పు పిండి
2 kg బెల్లం
పిడికెడు జీవమున్న మట్టి
తయారు చేసే విధానం:
నీడలో పేడకుప్ప పోసి, అందులో పిండి, బెల్లం, మట్టి వేసి, కొంచెం కొంచెం మూత్రం కలుపుతూ, ముద్దగా పిసకాలి. అన్ని కలిపిన తర్వాత నీడలో ఆరబోయాలి.
నీడలో పూర్తిగా ఎండిన తర్వాత పొడిరూపంలో ఉన్న ఘన జీవామృతాన్ని గోనె సంచుల్లో నిల్వచేయాలి. తేమ ఏ మాత్రమున్నా బూజుపట్టి చెడిపోతుంది.
ఇది ఆరు నెలలు నిల్వ ఉంటుంది. ఈ పద్ధతిలో వీలైనంత ఘన జీవామృతాన్ని తయారు చేసి నిల్వ చేసుకోవాలి.
ఏ పంటకైనా దుక్కిలో 200 నుండి 250 కిలోల ఘన జీవామృతం వేయాలి.
పంట వేసిన నెల రోజులకు మరో 200 నుండి 250 కిలోలు వేయాలి.
భూమిలో తేమ ఉన్నపుడు ఘన జీవామృతం వేసి భూమిలో కలపాలి.
3-4 సంవత్సరాలుగా వరుసగా ఘనజీవామృతం క్రమం తప్పకుండా వాడి భూసారాన్ని పెంచుతూ, వాతావరణం కలుషితం కాకుండా, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, పంటల్లో అధిగ దిగుబడిని సాధించవచ్చు, భూమి పూర్వపు సేంద్రియ తత్వానికి చేరే అవకాశముంది.
వీటికితోడు, "మల్చింగ్" అనగా నేలను ఎప్పుడు అంతరపంటతో గాని, ఆకులు, గడ్డితో గాని కప్పి ఉంచాలి. దీనివల్ల కలుపు నివారణ జరిగి తేమ నిలువచేసే శక్తి పెరిగి, వానపాములు అభివృద్ధి చెంది భూసారం పెరుగుతుంది.
RyotForum
Jeevamrutham Preparation by Narayana Reddy
RyotForum