పల్లె పదం లఘుచిత్రాల పోటీ
లఘు చిత్రాల పోటీ -కథాంశం ఎంపిక!
రైతు నేస్తం “పల్లె పదం” లఘు చిత్రాల పోటీకి పంపే కథలు ఎలా ఉండాలనేందుకు కొలమానాలు, పరిమితులు అంటూ ఏమీ లేవు. గ్రామీణ వాతావరణం, సాగు రంగం, రైతుల జీవన పోరాటం, సాంకేతిక పరిజ్ఞానం, సేంద్రియ సాగు విధానాలతో ముడిపడిన అంశాలు అయితే చాలు.
ముఖ్యంగా ఇలా ఉండేలా చూసుకోండి:
- సాగుతో కూడిన కథాంశం, ఇతివృత్తం ఏదైనా ఆకట్టుకునేలా ఉండాలి
- మీ లఘు చిత్రం పది మంది రైతులని కదిలించేదై ఉంటే బాగుంటుంది
- అన్నదాతల అవస్థలకి మీ వీడియో అద్దం పట్టేలా ఉండవచ్చు
- సాగురంగ ఆటుపోట్లని సమాజం, పాలకుల కళ్లకి కట్టేలా చిత్రించవచ్చు
- ఆదర్శ రైతుల నూతన సాగు విధానాలకి ప్రతిరూపంగా తీయవచ్చు
- గ్రామీణ జీవనంలో వచ్చిన మార్పులని ప్రతిబింబంగా చూపవచ్చు
- రైతన్నల సమష్టి కృషి, విజయగాథలని తెరకెక్కించవచ్చు
- సేంద్రియ సాగు ఆవశ్యకత, ఆటంకాల నేపథ్యంతో తీయవచ్చు
- పల్లె జనం మధ్య సరదాగా సాగే ముచ్చట్లని షార్టుఫిల్మ్గా మలచవచ్చు
నిబంధనలు:
- లఘు చిత్రం తెలుగు భాషలో తీయాలి
- వీక్షకాసక్తి, సరదా సన్నివేశాలు, తోటివారికి ఆదర్శంగా నిలిచేదై ఉండాలి
- కాపీ చేయరాదు, గతంలో ఎక్కడా ప్రదర్శించి, ప్రచురించి ఉండకూడదు
- సేద్యం, గ్రామీణ నేపథ్యానికి సంబంధించినవై ఉండాలి
- వీడియో నిడివి 14 నిమిషాలు మించరాదు
- లఘు చిత్రం జులై 31, 2020 లోపు పంపాలి
- హెచ్డీ క్వాలిటీ, హై రిజల్యూషన్లో తీయాలి
- వ్యక్తులు, సంస్థలు, పార్టీలు, పథకాలు, ప్రభుత్వాలని విమర్శించరాదు
- పోటీదారులు తెలుగు రాష్ట్రాలకి చెందినవారై ఉండాలి
- ఉత్తమ చిత్రాల ఎంపికలో జ్యూరీ కమిటీదే తుది నిర్ణయం
- అవార్డుకి ఎంపికగాని చిత్రాలని రైతునేస్తం యూట్యూబ్ ఛానల్లో ప్రదర్శించడానికి అంగీకరించాలి
వివరాలకు: 99490 94370, 95538 25532
దరఖాస్తు చివరి తేది: జులై 31, 2020
Short film Registration